మళ్ళీ సి‌ఎం కే‌సి‌ఆరే.. వారికి ముందే తెలుసా ?

35
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు మరో ఐదు నెలల్లో జరగనున్నాయి. ఈసారి అధికారం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ హవా గట్టిగా నడుస్తున్నప్పటికి, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా తాము రేస్ లో ఉన్నట్లు చెబుతున్నాయి. బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామని కాంగ్రెస్, బీజేపీ నేతలు తరచూ చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ రెండు పార్టీలు గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలకు కూడా బాగా తెలుసు. అయినప్పటికి తాటాకు చప్పుళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.. ప్రస్తుతం సంక్షేమంలోనూ అభివృద్దిలోనూ ఇతర ఏ రాష్ట్రాలకు సాధ్యం కానీ రీతిలో తెలంగాణ దూసుకుపోతుంది.

Also Read: CMKCR:బీఆర్ఎస్‌ హెచ్‌ఆర్‌డీ కార్యాలయం శంకుస్థాపన

దేశంలో ఎక్కడ లేని దళిత బంధు, రైతు బంధు, ఉచిత కరెంటు, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఇంటింటికి మంచి నీటి సౌకర్యం, కంటి వెలుగు.. వంటి ఎన్నో పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. అటు అభివృద్దిలోనూ దేశంలోనే నెంబర్ వన్ ఐటీ హబ్ గా తెలంగాణ రూపాంతరం చెందుతోంది. దీంతో ప్రజలు కే‌సి‌ఆర్ పాలనను కాదని బయటకు రారని ప్రతిపక్ష నేతలకు బాగా తెలుసు. అందువల్ల మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కే‌సి‌ఆర్ దే అనేది ప్రతిపక్షాలకు మింగుడు పడని వాస్తవం. ఇదే విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ కూడా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని, ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 100కు పైగా సీట్లు సాధిస్తుందని కే‌సి‌ఆర్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ కు ఉన్న ఆదరణను బట్టి చూస్తే.. అదే నిజం అయ్యేలా ఉందనేది రాజకీయవాదుల అభిప్రాయం.

Also Read: CMKCR:దేశానికి సమర్థవంతమైన నాయకులను తీర్చిదిద్దాలి

- Advertisement -