మదర్స్ డే ఎలా వచ్చిందంటే..!

554
- Advertisement -

అమ్మ ప్రేమకు ప్రతిరూపం,మమతకు ఆకారం,త్యాగానికి నిదర్శనం..‘అమ్మ’ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం.. ఇంకా ఎన్నెన్నో.. అమ్మని మించి దైవమున్నదా..అత్మను మించి అద్దమున్నదా..జగమే.. పలికే.. శాశ్వత సత్యమిదె..అందరినీ కనే శక్తి.. అమ్మ ఒక్కతే ..అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే..అంటూ అమ్మ గొప్పతనాన్ని అద్భుతంగా వివరించాడో సినీ కవి. ఈ పాటలోని చరణం చాలు అమ్మ విశిష్టతను అర్ధం చేసుకోవడానికి. అమ్మని మించిన దైవం ఎక్కడుంది. దేవుడు ప్రతి మనిషి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు.

అలాంటి మదర్స్ డే ఎలా ఏర్పడిందంటే…అన్నా జార్వీస్ అనే మహిళ 1890 లోనే తాను నివసిస్తున్న గ్రాఫ్టన్ నగరాన్ని వదిలి ఫిలడెల్ఫియాకు చేరుకుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం సాగించింది. తన ఆశయం నెరవేరకుండానే చనిపోయిన తల్లిని గుర్తింపు కోసం మదర్స్ డే ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆమె మదిలో కలిగింది. దీంతో తన ఆలోచనకు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించే దిశగా అడుగులు వేసింది.

Also Read:whatsapp:వాట్సాప్ స్టేటస్‌ నేరుగా ఫేస్‌బుక్‌లో

తన ప్రయత్నంలో భాగంగా ‘మదర్స్ డే’ని అంతర్జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని జార్వీస్ తీవ్రంగా ప్రయత్నించింది. ఆమె కృషి ఫలితంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో 1910లో తొలిసారి మదర్స్ డే రోజు అధికారిక సెలవుదినాన్ని ప్రకటించారు. తర్వాత అమెరికాలోని మిగతా రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాయి.

Also Read:బరువు తగ్గడానికి అధ్బుతమైన టిప్స్

మే 10, 1914న అమెరికా కాంగ్రెస్, మే నెలలోని రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా ప్రకటిస్తూ ఒక చట్టం చేసింది. క్రమక్రమంగా ఇది అంతర్జాతీయ మదర్స్ డేగా రూపాంతరం చెందింది.

- Advertisement -