మోడీ వేవ్ ముగిసింది

51
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో స్పందించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. నియంతృత్వాన్ని ఓడించగలమని ప్రజలు నిరూపించారని ప్రజలు చూపించారన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పుడు విపక్షాల వేవ్ వస్తోందని.. ఇక మోదీ హవా ముగిసిందన్నారు. కాంగ్రెస్ గెలిచింది అంటే.. బజరంగ్ బలి కాంగ్రెస్ తో ఉన్నారని బీజేపీతో కాదని..బీజేపీ ఓడిపోతే అల్లర్లు వస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు అని గుర్తు చేశారు.
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

Also Read:ఉసిరి గురించి ఇవి తెలుసా..

మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65 సీట్లకు పరిమితం అయింది. జేడీఎస్ 19 సీట్లను గెలుచుకుంది. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఒక సీటు దక్కించుకుంది. సర్వోదయ కర్ణాటక పార్టీకి ఒక సీటు లభించింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

- Advertisement -