T20:విండీస్‌కు పూర్వవైభవం వచ్చేనా?

6
- Advertisement -

వెస్టిండీస్ క్రికెట్ ఒకప్పుడు టీ20 ఫార్మాట్‌లో ప్రపంచాన్ని శాసించింది. 2012లో తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు.. 2016లో మరోసారి విశ్వవిజేతగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2016లో రెండోసారి ప్రపంచకప్ సాధించినప్పుడు కెప్టెన్ డారెన్ సామీ ఆనందానికి అవధుల్లేవు.

అయితే పదేళ్ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం సామీ ప్రధాన కోచ్‌గా ఉన్నప్పటికీ వెస్టిండీస్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. 2016 తర్వాత జరిగిన నాలుగు టీ20 ప్రపంచకప్‌లలో ఒక్కసారి కూడా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

టెస్టుల్లోనూ వెస్టిండీస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. తొలి మూడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చక్రాల్లో పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో నిలిచింది. వన్డేల్లో గత రెండు ఛాంపియన్స్ ట్రోఫీలకు అర్హత సాధించలేకపోవడంతో పాటు 2023 ప్రపంచకప్‌లోనూ ఆడే అవకాశం కోల్పోయింది. 2025 ఆరంభం నుంచి టీ20ల్లో జట్టు విజయాల శాతం 42గా ఉంది. పూర్తి సభ్యత్వం కలిగిన జట్లలో శ్రీలంక, జింబాబ్వే మాత్రమే ఈ విషయంలో వెస్టిండీస్ కంటే వెనుకబడి ఉన్నాయి.

క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ఆటగాళ్లకు చెల్లించే రిటైనర్ ఫీజులను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ కాంట్రాక్టుల వ్యవధిని ఏడు నెలలకు కుదించడంతోపాటు, కొన్ని టోర్నీలను కూడా నిలిపివేసింది. దీంతో ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలా? లేక ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలా? అనే సందిగ్ధంలో పడుతున్నారు.

ప్రస్తుత తరం అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన నికోలస్ పూరన్ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై, ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. వెస్టిండీస్ టీ20 క్రికెట్ పునర్నిర్మాణంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) కీలక పాత్ర పోషిస్తోందని గంగా అభిప్రాయపడ్డాడు. మొత్తంగా చూస్తే.. వెస్టిండీస్‌లో టీ20 ప్రతిభకు కొదవలేదు. అయితే ఆర్థిక స్థిరత్వం, ఆటగాళ్ల లభ్యత, యువ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే ఆ ప్రతిభను స్థిరమైన విజయాలుగా మార్చగలదు. కరీబియన్ క్రికెట్ మళ్లీ ప్రపంచాన్ని శాసించాలంటే సమర్థవంతమైన ప్రణాళిక, బలమైన దేశవాళీ వ్యవస్థ అత్యవసరం.

Also Read:కాంగ్రెస్ అరాచకం..రాజ్‌నాథ్ ఫైర్

- Advertisement -