మార్కో రూబియో టూర్‌పై రాహుల్

11
- Advertisement -

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రూబియో ముంబై పర్యటనకు సంబంధించి విదేశాంగ శాఖ అధికారుల్లో గందరగోళం నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో రాహుల్ గాంధీ స్పందించారు. మిస్టర్ రూబియో తన ఉద్యోగిని ముంబైకి పిలిపించుకున్నారు. మోదీజీ.. మీ విదేశాంగ శాఖ అధికారులకు అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. మీరు వివరణ ఇవ్వాలనుకోవచ్చు. ఒకవేళ మీకు నేను వివరించాలని అనుకుంటే తప్ప అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్ 17 నుంచి 22 వరకు ఉజ్బెకిస్థాన్, భారత్‌లో పర్యటించనున్నారు. భారత పర్యటనలో భాగంగా ముంబై, జామ్‌నగర్‌లలో ఆయన పర్యటించి, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడం, ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.

Also Read:కాంగ్రెస్ అరాచకం..రాజ్‌నాథ్ ఫైర్

- Advertisement -