KTR:కాంగ్రెస్ తెచ్చిన కరువే ఇది

5
- Advertisement -

కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది అని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 750+ టీఎంసీల గోదావరి నీళ్లను..250 టీఎంసీల కృష్ణా నీళ్లను..దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు.

కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని..గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు.పాలమూరు – రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు.ఎల్ నినో వస్తున్నదని.. ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు.

ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే..పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను..పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది అని ఆరోపించారు.

Also Read:కాంగ్రెస్ అరాచకం..రాజ్‌నాథ్ ఫైర్

- Advertisement -