ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన కీరన్‌..

262
- Advertisement -

అతని ఆట విద్వంసకము ప్రత్యర్థులకు పగలే చుక్కలు చూపిస్తాడు. బ్యాటింగ్‌ బౌలింగ్‌తో తనదైన శైలిలో ఆటను ఆస్వాదించేలా ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తాడు. అతన్ని చూస్తే ఆరడుగుల బుల్లెట్‌ లా కనిపిస్తాడు. కానీ అతని బ్యాట్‌ పట్టుకుని నడిచి వస్తే మైదానంలో ప్రేక్షకులు ఆకాశంవైపుకు చూస్తారు. అతను ఆడిన 13 ఐపీఎల్‌ సీజన్‌లలో 5సార్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనేవరో ఈపాటికి తెలియాలి. అతనే…కీరన్ పోలార్డ్‌.

13సీజన్లు ఒకే జట్టుతో ట్రావెల్‌ అయిన వ్యక్తి అదే జట్టుకు ప్రత్యర్థిగా కనిపించకూడదని..తను ఆడిన జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా మారాడు. ఈపాటికే అర్థమయి ఉంటుంది. ముంబై ఇండియన్స్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కీరన్ ఈ రోజు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. త‌మ జ‌ట్టు సోష‌ల్‌మీడియా ఖాతాల‌కు కీర‌న్ పోలార్డ్ ఫొటోని ప్రొఫైల్ ఫొటోగా పెట్టింది. ఆ ఫొటో కింద ఎప్ప‌టికీ ముంబై ఇండియ‌న్స్‌తోనే అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతుంది.

13 సీజ‌న్ల‌లో 3,412 ప‌రుగు చేశాడు. 69 వికెట్లు తీశాడు. అయితే, పోయిన ఏడాది సీజ‌న్‌లో పోలార్డ్‌ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. 144 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దాంతో, ఈ సీజ‌న్‌లో కొత్త ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న కీరన్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్తున్నాను అని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

మంత్రి హరీశ్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ..

సినీ పరిశ్రమ దిగ్గజం కృష్ణ: రాహుల్

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు..

 

- Advertisement -