బెంగాల్‌లో చివరి విడత పోలింగ్…అప్‌డేట్

164
kolkatha
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి విడుత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుండగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. చివరి విడతలో 35 స్ధానాలకు పోలింగ్ జరగనుండగా ఇప్పటివరకు 259 నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్‌ పూర్తయింది.

చివరి విడుతలో అధికార టీఎంసీ, బీఎస్పీ, బీజేపీలు 11 మంది అభ్యర్థులను బరిలో నిలుపగా.. సీపీఎం నాలుగు, కాంగ్రెస్‌ మూడు, ఏఐఎఫ్‌బీ రెండు, ఆర్‌ఎస్పీ ఒక స్థానాల్లో పోటీ చేస్తోంది. బెలెఘాటాలో బీజేపీ నుంచి కాశీనాథ్‌ బిస్వాస్‌, సీపీఎం నుంచి రాజిబ్‌ బిస్వాస్‌, టీఎంసీ పరేష్‌ పాల్‌ పోటీ చేస్తున్నారు. పాలక టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీతో పాటు మాల్దా జిల్లాలో సంయుక్తా మోర్చా (కాంగ్రెస్‌-సీపీఎం-ఐఎస్‌ఎఫ్‌ కూటమి) అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ముర్షిదాబాద్‌ జిల్లా పరిధిలోనూ ఇదే తరహా పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -