సన్‌రైజర్స్ పై చెన్నై విజయం..

37
csk

ఐపీఎల్ 1వ సీజన్‌లో భాగంగా మరో విజయాన్ని నమోదుచేసుకుంది చెన్నై. హైదరాబాద్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 75; 12 ఫోర్లు), డు ప్లెసిస్‌ (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో జట్టును నడిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 78 బంతుల్లోనే 129 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (46 బంతుల్లో 61; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (55 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా… కేన్‌ విలియమ్సన్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో ధాటిగా ఆడాడు.