లాక్ డౌన్‌పై సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం…

43
ali

రాష్ట్రంలో లాక్‌డౌన్‌పై తుది నిర్ణ‌యం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌దేనని వెల్లడించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. త్వరలో రాష్ట్రంలోని పరిస్ధితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వ‌హిస్తార‌ని….. సమీక్ష తర్వాత లాక్‌ డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటార‌ని వెల్లడించారు. లాక్‌ డౌన్‌ పెట్టడం సీఎంకు ఇష్టం లేద‌న్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులో చ‌ర్చించాం.. లాక్ డౌన్‌ పెట్టాలా లేదా అన్నది మాత్రం సీఎం నిర్ణయం తీసుకుంటార‌ని తెలిపారు. కరోనా కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా కూడా విచ్చలవిడిగా కొనసాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ దందా జ‌రుగుతుంద‌ని.. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం అన్నారు.