తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. బుధవారం కోమరిన్ ప్రాంతం నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఈరోజు తమిళనాడు తీర ప్రాంతం మరియ దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ఆవర్తనంగా ఏర్పడి 1.5కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
అలాగు బుధవారం క్రింద స్థాయి తూర్పు గాలులలో దక్షిణ అరేబియన్ సముద్రం మధ్య ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న భూమధ్య రేఖ-హిందూ మహాసముద్రం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు 0.9కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఈరోజు బలహీనపడింది.
కాగా, రాష్ట్రంలో ఈ రోజు కొన్ని చోట్ల, రేపు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది.