శ్రీశైలంకు నిరంజన్ రెడ్డి..సాయంత్రం గేట్లు ఎత్తివేత

453
Srisailam Dam Niranjan Reddy
- Advertisement -

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం డ్యాంలోకి వరద ఉధృతి పొటెత్తుతుంది. ఇవాళ సాయంత్రం శ్రీశైలం డ్యాం గేట్లు తెరవనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరుకానున్నారు. కృష్ణా నది పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పూర్తిమట్టానికి చేరుకోవడంతో ఈ సాయంత్రం 5 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు

- Advertisement -