పోలీస్ ఫస్ట్ బెటాలియన్ లో మొక్కలు నాటిన కోలేటి దామోదర్

407
koleti Damodar
- Advertisement -

పోలీస్ ఫస్ట్ బెటాలియన్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గోన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా అయితే కష్టపడ్డామో అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలన్నారు.

koleti Damodar Gupta

చెట్లను పెంచడం అంటే ప్రకృతిమాత దీవెనలు పొందటమే అన్నారు. ఇప్పుడు మనం చెట్లను పెంచడం అశ్రద్ధ చేస్తే ముందు ముందు తరాలు మనల్ని క్షమించవని చెప్పారు. చెట్లను నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ డి.జి. శ్రీమతి అభిలాష బిష్ట్, ఐ.పి.ఎస్ , పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -