మల్లేశం ట్రైలర్ చూడండి:కేటీఆర్

456
- Advertisement -

చేనేత కార్మికుల కష్టాలను తగ్గించడం కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ఆధారం తెరకెక్కిన ‘మల్లేశం’. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మల్లేశం ట్రైలర్ చూడండంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

గ్రామీణ ప్రాంతంలో పుట్టిన సృష్టికర్త… స్ఫూర్తిదాయక ప్రయాణం ఆధారంగా తీసిన తెలంగాణ వ్యక్తి చింతకింది మల్లేశం. 2017లో ఆసు యంత్రం కనిపెట్టినందుకు పద్మశ్రీ పురస్కారం పొందిన ‘మల్లేశం’. చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

స్కూళ్లో పిల్లలు చిరంజీవి సినిమా స్టోరీ చెప్పే సీన్ నుంచి మొదలైన ట్రైలర్… చివర్లో ‘ముందుంది ముసళ్ల పండుగ… సినిమా చూసి దీవించుండ్రి నిండుగా అని ప్రియదర్శి చెప్పే డైలాగ్‌తో ముగుస్తుంది. మల్లేశం లవ్ స్టోరీ, ఫ్రెండ్స్‌తో సరాదాగా సాగే ఘటనలు.. తల్లి కష్టం చూడలేక ఆసు యంత్రం కనిపెట్టే క్రమంలో పడే శ్రమ, ఎదుర్కొన్న ఛీత్కారాలు అన్ని సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా… ఇక్కడి యాస, పీర్ల పండగ, జానపద గేయాలను డైరెక్టర్ రాజ్ ఆర్ స్క్రీన్ మీద చూపించారు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా.. మల్లేశం జీవితాన్ని యథాతథంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

 

- Advertisement -