నరేంద్ర మోడీ…అను నేను

332
modi oath
- Advertisement -

భారీ మెజార్టీతో రెండోసారి బీజేపీని అధికారంలోకి తెచ్చిన నరేంద్ర మోడీ… రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌ లోని ఫోర్ కోర్టు ప్రాంగణంలో మోడీ చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ రాజకీయ చరిత్రలో ఓ ప్రధాని రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్‌లో కాకుండా ఫోర్ కోర్టులో ప్రమాణ స్వీకారం చేయడం ఆరోసారి.

వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు,ప్రధానులు,పలు రాష్ట్రాల సీఎంలు,రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.కాంగ్రెస్ నేతలు సోనియా,రాహుల్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి,బిబి పాటిల్,రంజిత్ రెడ్డి,వెంకటేశ్ హాజరయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి సమీప ఎస్పీ అభ్యర్థి షాలిని యాదవ్‌పై 4లక్షలకు పైగా మెజార్టీతో మోడీ గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ తొలిసారిగా వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. మోడీ ధాటికి బీజేపీ త్రిబుల్ సెంచరీ కొట్టి 303 ఎంపీ స్ధానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలు 50 మంది ఎంపీలుగెలుపొందారు.

2014లో మోడీ హవా… యూపిఏ ప్రభుత్వంపై వ్యతిరేకత… ఎన్డీఏకు 334 సీట్లను కట్టబెట్టింది. కూటమిలోని బీజేపీయే 283సీట్లతో మెజార్టీ మార్క్‌ను దాటింది.మరి అలాంటి మోడీ హవా మరోసారి దేశంలో రానుందా?! దేశ ప్రజలు రెండోసారి కూడా మోడీకే పట్టం కట్టనున్నారా? అంటే అనేక సందేహాలు.కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ మోడీ ఒక్కడే బీజేపీని అధికారంలోకి తెచ్చారు.

- Advertisement -