వెంకయ్యను బురిడీ కొట్టించారు..!

203
Was duped by weight-loss pill ad says Venkaiah
- Advertisement -

బురిడీ కొట్టించే వార్తలను మనం తరచూ పేపర్ల, ఛానళ్లు, సోషల్ మీడియలో చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వీటిలో బరువు తగ్గించే మందుల ప్రకటనల గురించి చూడని,చదవని వారుండరు. మా మందు వాడితే వారం రోజుల్లో సులువుగా 5 కేజీల బరువు తగ్గిపోతారు..?ఇంకొంతమంది బరువు తగ్గకపోతే డబ్బులు వాపస్ అంటూ ప్రకటనలు ఇస్తారు..ఇలాంటి  ప్రకటనలు సహజంగానే అందరిని ఆకట్టుకుంటాయి.

అయితే ఇలాంటి ఓ నకిలీ వాణిజ్య ప్రకటన బారిన పడి సాక్షాత్తు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మోసపోయారు. అదికూడా ఆయన ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక నన్నో ప్రకటన ఆకర్షించింది. మేమిచ్చే మందులతో 28 రోజుల్లో కచ్చితంగా బరువు తగ్గుతారంటూ ప్రకటనలో ఊదరగొట్టారు. ఈ విషయాన్ని నేను కొందరితో చర్చించాను. అది అబద్ధమని వాళ్లు చెప్పారు. కానీ దాని సంగతేంటో చూద్దామని.. డబ్బులు చెల్లించాను  అని రాజ్యసభలో   తెలిపారు.

దీనిపై వినియోగదారుల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయన విచారణ జరిపి, సదరు ప్రకటన నకిలీ అని, ఆ ప్రకటన ఇచ్చిన కంపెనీ అమెరికాకు చెందినదని చెప్పారట. నకిలీ ప్రకటన విషయంలో తన అనుభవాన్ని వివరించిన వెంకయ్య ఇలాంటి ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించగా.. సభలోనే ఉన్న రాం విలాస్ పాశ్వాన్.. ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -