టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు సస్పెండ్‌….

86
rajya
- Advertisement -

పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో భాగంగా రాజ్య‌స‌భ కార్య‌క‌లాపాల‌ను అడ్డుకుంటున్న 19 మంది ఎంపీల‌పై వారం రోజుల పాటు స‌స్పెన్ష‌న్ విధించారు. స‌భ‌కు ఆటంకం క‌లిగిస్తున్నారనే కార‌ణంతో వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మెన్ హ‌రివంశ్ తెలిపారు. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న చేప‌ట్టారు. జీఎస్టీ, ద్ర‌వ్యోల్బ‌ణం, ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు ప‌ట్టుప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, దీవ‌కొండ దామోద‌ర్‌రావు, వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ల‌ను వారం పాటు స‌స్పెండ్ చేశారు. వేటు ప‌డిన వారిలో కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ ఎంపీలు కూడా ఉన్నారు. ఆగ‌స్టు 12వ తేదీ వ‌ర‌కు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

- Advertisement -