అప్పుడు నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని- కేటీఆర్‌

98
ktr speech

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ MCR-HRD అక్షర హాల్‌లో AIS అండ్‌ CCS ఆఫీసర్స్ 94వ ఫౌండేషన్ కోర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. అనంతరం కోర్స్ కంప్లీట్ చేసిన ట్రైనీ ఆఫీసర్ లకు కోర్స్ సర్టిఫికెట్, అవార్డ్స్ ను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ డైరెక్టర్ జనరల్ ఫర్ MCR- HRD ఆచారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ MCR- HRD హర్పీథ్ సింగ్, ట్రైనీ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పాలిటిక్స్ లోకి రాకముందు నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని..రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, త్యాగాలు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. సర్వీసులో చేరిన 6,7 ఏళ్లకే మైండ్ సెట్ మారుతున్న అధికారులున్నారు. ఎన్నేళ్లయినా పాజిటివ్‌గా ఉన్న అధికారులను నా అనుభవంలో కొంతమందినే చూసాను. సర్వీస్‌లో చేరాక అధికారిక కార్యక్రమాలే కాదు… మీరు పనిచేసే చోట పెట్టుబడులు వచ్చేలా.. కంపెనీలు స్థాపించేలా.. ఉపాధి కల్పించేలా పని చేయండి. ఒక ఏంట్రపెన్యూర్‌గా ఉండండి. ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్‌తో పని చేయండి అని ట్రైనీ ఆఫీసర్లకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.

మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో… ఇప్పటికీ వేలాది గ్రామాల్లో కరెంట్ లేదు, వాటర్ లేవు, రోడ్ కనెక్టివిటీ లేదు. చాలా ఇళ్లకు మరుగుదొడ్లు లేవు. ఓవైపు వందలాది ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తున్న మన దేశానికి… రెండో వైపు కూడా చూడాలని కేటీఆర్‌ వివరించారు.

కొన్ని రోజుల క్రితం ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. నలుగురు కిరాతకులు ఒక అమ్మాయిని చంపేశారు. నిందితులను చంపేయాలి, వెంటనే ఉరి తీయాలి అని అందరూ అంటున్నారు. ఆ ఆవేశం, ఆవేదన అందరికీ ఉంటుంది. నాకు కూడా అదే ఉంది… కానీ ఒక ప్రజాప్రతినిధిగా అలా అనలేను. నిర్భయ ఘటనలో నిందితులకు ఇప్పటికీ ఉరిశిక్ష అమలు కాలేదు. ఉగ్రవాది కసబ్ ని ఎన్నేళ్ళు జైల్లో పెట్టామో చూసాం ఇలాంటి చట్టాలు మారాలి అని కేటీఆర్‌ అన్నారు.