డోర్నకల్ రైల్వే జంక్షన్‌ను అభివృద్ధి చేయాలి-మంత్రి

389
Minister Satyavathi Rathod
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయిన మంత్రి సత్యవతి రాథోడ్ పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీలు బండ ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, మాలోతు కవితలు హాజరైయ్యారు. అనంతరం డోర్నకల్ క్రూ లాబీని అక్కడి నుంచే నిర్వహించాలని, డోర్నకల్ రైల్వే జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

డోర్నకల్ రైల్వే జంక్షన్ వద్ద సిబ్బంది డిపో 100 ఏళ్ల కింద ఏర్పాటైంది. కానీ 2007లో అనైతికంగా డోర్నకల్ జంక్షన్‌ను విజయవాడకు తరలించారని పేర్కొన్నారు. కానీ విజయవాడలో ఈ డిపో ఏర్పాటు చేయడం వల్ల అక్కడి కార్మికులకు ఆరోగ్య పర సమస్యలు రావడం, ఆర్ధిక భారం సంస్థపై పెరగడం, రైల్వే ఉద్యోగులు అధిక పనిగంటలు ఉద్యోగంలో ఉండాల్సి వస్తుందని గుర్తించిన రైల్వే యాజమాన్యం క్రూ లాబీని విజయవాడకు తరలించిన 12 ఏళ్ల తర్వాత తిరిగి డోర్నకల్‌లో ప్రారంభించిందని తెలిపారు.

Smriti Irani

అయితే డోర్నకల్ రైల్వే జంక్షన్‌లో ఇప్పటికీ బీట్‌లు మార్చకుండా విజయవాడ నుంచే బీట్ మార్పులు చేస్తున్నారని, దీనివల్ల సంస్థకు భారంగా మారడమే కాకుండా, ఉద్యోగులకు ఆరోగ్యపరంగా, పనిగంటల పరంగా కూడా నష్టం జరుగుతోందన్నారు. రైల్వే సంస్థకు, అక్కడ పనిచేసే ఉద్యోగులకు కూడా మేలు చేయాలంటే ఈ క్రూ లాబీని డోర్నకల్ నుంచి నిర్వహించాలని, ఇందుకోసం ప్రసిద్ద జంక్షన్‌గా విలసిల్లిన డోర్నకల్ రైల్వే జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. డోర్నకల్‌లో రన్నింగ్ స్టాఫ్ కోసం క్వార్టర్లు నిర్మించాలని, వసతులు కల్పించాలని విజ్ణప్తి చేశారు.

Minister Satyavathi Rathod Meets Union Minister Piyush Goyal..Minister Satyavathi Rathod Meets Union Minister Piyush Goyal..

- Advertisement -