‘కాంస్య’ కాంతుల అరుణ తారకి గ్రాండ్ వెల్ కమ్

257
aruna
- Advertisement -

భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో సంచలన ప్రదర్శన నమోదు చేసి, ప్రపంచకప్‌లో ఏండ్లుగా పతకం కోసం ఎదురుచూస్తున్న భారతావని మది పులకించేలా క్యాంస పతకం సాధించిన హైదరాబాదీ బుడ్డా అరుణారెడ్డికి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ మహిళల వాల్ట్స్‌లో మూడోస్థానంతో కాంస్య పతకం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన జిమ్నాస్ట్‌గా అరుణ రికార్డు నమోదు చేసింది. అరుణను రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ వెంకటేశ్వర రెడ్డి ఘనంగా సన్మానించారు.

Aruna-Reddyఅనంతరం శంషాబాద్‌ నుంచి హైదర్‌ గూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ప్రపంచ్‌ కప్‌ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రభుత్వ సహాకారంతో ఈ మెడల్‌ సాధించినట్టు ఆమె పేర్కొన్నారు. జిమ్నాస్టిక్స్‌ లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని అరుణ రెడ్డి తెలిపారు.

- Advertisement -