నందినిని అభినందించిన వెంకటేశ్వరరెడ్డి..

128
venkateshwar reddy
- Advertisement -

పాటియాల లో జరుగుతున్న భారత అథ్లెటిక్స్ జూనియర్ క్యాంప్ లో ఉన్న తెలంగాణ కు చెందిన అథ్లెటిక్స్ (100 మీటర్ల హార్డిల్స్) క్రీడాకారిణి నందిని, కెన్యా, నైరోబి లో ఈ నెల 17 నుంచి 22 వరకు జరుగబోతున్న జూనియర్ అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల హార్డిల్స్ విభాగం లో భారత్ దేశం తరపున పాల్గొంటున్నందున కుమారి అగసరి నందిని (17 సం) ని ఈరోజు ఉదయం 11 గంటలకు స్వయంగా సికింద్రాబాద్, కాప్రా, చంద్రపురి కాలనీ లో ఉంటున్న నందిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు నందిని ని కలిసి అభినందించి, ఆల్ ది బెస్ట్ తెలియజేసిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి.

టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన నీరజ్ చోప్రా ను ఆదర్శంగా తీసుకుని వచ్చే 2024 లో జరిగే పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అర్హత సాధించి, భారత్ కు స్వర్ణ పథకం తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేసి, ఆశీస్సులు అందజేసిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఐటీ మంత్రి కేటీఆర్ గారు, క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 27 సభ్యులలో నందిని ఒక్కరే తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం.

- Advertisement -