Harishrao:దసరా నాటికి వరంగల్ హెల్త్‌ హబ్‌

51
- Advertisement -

తెలంగాణ ఆరోగ్య ప్రదేశ్‌ మార్చే లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్‌ సిటీ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్‌ అండ్ బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి వరంగల్ హెల్త్ సిటీ పనులు పూర్తి చేయాలని సూచించారు.

గ్రేటర్ పరిధితో పాటు నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న సనత్ నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. త్వరలో నిమ్స్‌ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000పడకల బిల్డింగ్‌కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

Also Read: కేసీఆర్ రియల్ హీరో..వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని మంత్రి అన్నారు. ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆస్ప‌త్రులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి పూర్తయితే మెడికల్ హబ్‌గా మారుతుందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ తరుపున అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఆర్ అండ్ బీ అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.

Also Read: BRS:కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం..

- Advertisement -