BRS:కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం..

34
- Advertisement -

జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్దమవుతున్న సీఎం కేసీఆర్ ఇందులో భాగంగా ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఢిల్లీ వసంత విహార్‌లో పార్టీ కేంద్రకార్యాలయాన్ని 1.05 గంటలకు ప్రారంభించారు.

అనంతరం మొదటి పార్టీ ఆఫీస్‌ అంతస్థులోని తన చాంబర్‌ లో కూర్చున్న కేసీఆర్.. రిజిస్ట్రేషన్‌లో సంతకం చేశారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు.

Also Read:బొగ్గు గని కార్మికుల దినోత్సవం 2023

2021 సెప్టెంబర్‌ 2న ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో కార్యాలయాన్ని నిర్మించారు. ఈ స్థలానికి బీఆర్‌ఎస్‌ పార్టీ మొత్తం రూ. 8.64 కోట్లు చెల్లించింది. జీ ప్లస్‌ త్రీగా భవనాన్ని నిర్మించారు. ఆఫీస్ లోయర్‌ గ్రౌండ్‌లో మీడియా హాల్‌, సర్వెంట్‌ క్వార్టర్స్‌ ఉంటాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్‌, రిసెప్షన్‌ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ చాంబర్‌, ఇతర చాంబర్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌ నిర్మించారు. 2, 3 వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉంటాయి.

Also Read:Directors Day:దాసరి బర్త్ డే

- Advertisement -