వాన్నక్రై దాడులు చేయించింది ఆ దేశమా..!!

191
wannacry-ransomware-cyber-attack-may-n-korea-link
wannacry-ransomware-cyber-attack-may-n-korea-link
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా వాన్నక్రై మాల్‌వేర్‌ వణుకు పుట్టించింది. ర్యాన్సమ్ వేర్ వైరస్ గా కంప్యూటర్లలోకి ప్రవేశించిన ఈ వైరస్ సృష్టించిన కలకలం అంతాఇంతా కాదు. బ్రిటన్ ఆసుపత్రుల్లో కంప్యూటర్ వ్యవస్థ పనిచేయలేదు. జపాన్‌లో రైళ్లు ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి.. చైనాలో కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఇబ్బందులపాలయ్యాయి. ఉత్తరకొరియాలోని ఆస్పత్రులూ ఇక్కట్లపాలయ్యాయి. అయితే ఈ దాడుల వెనుక ఉత్తర కొరియా హస్తముందని, సెక్యూరిటీ రీసెర్చర్లు సంచలన ప్రకటన చేశారు.

అందుకు సంబందించిన డిజిటల్ ఆధారాలను దొరికాయన్నారు. లాజరస్ అనే హ్యాకర్ గ్రూప్ ఉత్తర కొరియా ప్రభుత్వంతో సంబంధాలను కలిగివుందని, వారి టూల్ కోడ్ ను హ్యాక్ అయిన కంప్యూటర్లలో కనుగొన్నామని ఫిడిలిస్ సైబర్ సెక్యూరిటీలో థ్రెడ్ రీసెర్చ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న జాన్ బాంమెనెక్ తెలిపారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఉత్తర కొరియా నిపుణులు ‘వాన్నా క్రై’ కోడ్ రాసుంటారని అనుమానిస్తున్నారు. అలా కాకపోతే, ఓ థర్డ్ పార్టీ కోడ్ ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడినట్టుగా భావించాలని అన్నారు.

north

కాగా, వైరస్ దాడులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయాన్ని శోధిస్తున్నామని వైట్ హౌస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సలహాదారు థామస్ బోసెర్ట్ వెల్లడించారు. ఈ వైరస్ పై పరిశోధనలు చేస్తున్న పలువురు రీసెర్చర్లు 2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలో జరిగిన భారీ హ్యాకింగ్ కు దీనికి సంబంధాలున్నాయని, ఆనాడు వైరస్ ను సోనీ సంస్థలోకి పంపింది కూడా ఉత్తర కొరియానేనని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను హత్య చేసే పన్నాగం కథాంశంతో సోనీ ఓ సినిమాను తీయగా, దాని విడుదలకు కొన్ని రోజుల ముందు సైబర్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.

‘వాన్నా క్రై’ సైబర్‌ దాడులు భారత ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావితం చేయలేదు. ఆసియా, ఐరోపా దేశాలు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినప్పటికీ భారత్‌పై ఈ ప్రభావం అంతంతగానే ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ‘భారత కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’ (సిఇఆర్‌-ఇన్‌) స్వయంగా వెల్లడించింది. యూరప్, అమెరికా, రష్యాల్లో సోమవారం సంస్థలు, కంపెనీల పనులు ప్రారంభం కాగానే వాన్నా క్రై నష్టం భారీగా కనిపించింది. ఇప్పటికే వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా, తాజా సైబర్‌ దాడి ప్రభుత్వాలకు మేలుకొలుపని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. విండోస్‌ ఎక్స్‌పీకి సబంధించిన అప్‌డేట్‌ను ‘మైక్రోసాఫ్ట్‌ సెక్యూరిటీ బులెటిన్‌ ఎమ్‌ఎస్‌17–010’ పేరుతో మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. చైనాలో ప్రభుత్వ ఏజెన్సీలు సహా 30వేల ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షల సంఖ్యలో కంప్యూటర్లు వాన్నా క్రై బారిన పడ్డాయని క్విహూ360 అనే చైనా యాంటీవైరస్‌ సంస్థ చెప్పింది.

- Advertisement -