మెర్స్-కోవ్‌ విజృంభణ: డబ్ల్యూహెచ్‌వో

89
- Advertisement -

మీడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్)గా పిలిచే ప్రాణాంతకమైన వైరస్ విజృంభిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సౌదీ ఆరేబియాలో  ఈ వైరస్ పుట్టిందని తెలిపింది. మెర్స్-కోవ్ అనేది డ్రోమెడరీ ఒంటెల నుండి మానవులకు బదిలీ చేయబడిన వైరస్ అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇది జూనోటిక్‌ (జంతువుల నుంచి మానవులకు సంక్రమించేది) వైరస్ అని పేర్కొంది.

మెర్స్ ఎక్కువగా మధ్య ప్రాచ్యం ఆఫ్రికా దక్షిణాసియాలోని దేశాల్లో గుర్తించడం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది. 2012 నుండి 27దేశాల్లో మెర్స్ కేసులను గుర్తిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది ఎక్కువగా జన్యువుల క్రమానుగత ప్రకారం గబ్బిలంలో ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

సౌదీ ఆరేబియాలో పుట్టిన ఈ వైరస్ వల్ల ఖతార్ లోని ఫుట్‌ బాల్ చూసేందుకు వెళ్లిన వారు ఒంటెలకు దూరంగా ఉండాలని పలు దేశాల మంత్రులు సూచిస్తున్నారు. ఇటీవలే అమెరికాలో శ్వాసకోశ సంబంధిత కేసులు పెరుగుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో నివేదించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

జికా వైరస్ లక్షణాలు, నివారణ చర్యలు

కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా.. ఇవి తెలుసా!

డయాబెటిస్‌ కట్టడికి చిట్కాలు..

- Advertisement -