ఇదివరకే కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తాజాగా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించింది. ఫలితంగా ఇప్పటివరకు వైజయంతీ మూవీస్ అందజేసిన కరోనా విరాళం మొత్తం రూ. 25 లక్షలకు చేరుకుంది. చిత్ర పరిశ్రమకు వెన్నెముక అయిన దినసరి వేతనంతో పనిచేసే కార్మికులను ఆదుకోవడానికి సీసీసీకి రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రకటించింది.
సినీ కార్మికులను ఆదుకోవడానికి సీసీసీని ఏర్పాటు చేయడాన్ని తాము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామనీ, చిత్రసీమలోని మిగతా ప్రముఖులంతా ఈ మంచి పనికి తోడ్పాటునివ్వాలనీ కోరింది. ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలనీ, కరోనాపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు అందరూ సహకరించాలనీ సంస్థ విజ్ఞప్తి చేసింది.
We'd like to contribute 5L to the #CoronaCrisisCharity Fund to support the daily wage movie workers who are the backbone of the movie industry. We really appreciate this initiative & would request the rest of the film fraternity to support this cause. #StayAtHome @KChiruTweets pic.twitter.com/ojlHopUPmu
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 13, 2020