త్వరలో విశాఖ టూ సింగపూర్‌కి క్రూయిజ్ సేవలు

37
- Advertisement -

ఏపీ పర్యాటక రంగంలో మరో ముందడుగు పడనుంది. చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్ క్రూయిజ్ సేవలు మార్చిలో ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రూయిజ్ కోసం లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అటు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నుంచి త్వరలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రూ.4,902 కోట్ల వ్యయంతో 2022లో పోర్టుకు శంకుస్థాపన జరగగా, తొలి దశలో 34.04 MMTPA సామర్థ్యంతో ఒక బెర్త్ సిద్ధమైంది. ఆరు నెలల్లో మరో మూడు బెర్తులు రెడీ కానున్నాయి. ఈ నెలాఖరుకు తొలి నౌక వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

భవిష్యత్ లో విశాఖ నుంచి థాయిలాండ్, మలేషియా శ్రీలంక, మాల్దీవులుకు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటు లోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.

Also Read:హృదయాన్ని హత్తుకునేలా ‘శశివదనే’

- Advertisement -