- Advertisement -
ఐపీఎల్ 2020…13వ సీజన్‌పై చేతులెత్తేసింది బీసీసీఐ. తొలుత ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ టోర్నీని వాయిదా వేసిన బీసీసీఐ తర్వలో ఐపీఎల్ సీజన్ 13కు సంబంధించి త్వరలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నట్లు సమాచారం.
దేశంలో కరోనా రోజురోజుకు విస్తరిస్తుండటంతో ఇప్పుడు రద్దు మినహా మరో ప్రత్యామ్నాయం బీసీసీఐ ముందు కనిపించడం లేదు. ఎందుకంటే లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలూ కనిపిస్తున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వ అధికారులతో సమావేశం అనంతరం బీసీసీఐ ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
ఒకవేళ ఏప్రిల్ 15 తర్వాత సాహసోపేతంగా టోర్నీని నిర్వహించినా.. ప్రేక్షకులు లేకుండానే.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఐపీఎల్ కళ తప్పడం ఖాయం. దీంతో ఐపీఎల్ 13వ సీజన్ రద్దుకే బీసీసీఐ మొగ్గుచూపుతోంది.
- Advertisement -