రాజకీయాలకు వివేక్ గుడ్‌ బై..!

256
vivek bsp
- Advertisement -

పెద్దపల్లి మాజీ ఎంపీ,కాకా తనయుడు ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని సంచలన ప్రకటన చేశారు. టీఆర్‌ఎస్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ వివేక్ బీజేపీ,బీఏస్పీ నుండి పోటీచేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఓ దశలో ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అని ప్రచారం జరిగింది.

అయితే ఇవాళ నామినేషన్లకు చివరిరోజు కావడంతో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ప్రజలు అభిమనం చూపిస్తున్నారని.. వారి మద్దతుతో ఈసారి పోటీ చేయాలని భావించినా.. తక్కువ సమయం ఉన్నందున ఎన్నికల గుర్తు ప్రజల్లోకి బలంగా చేరదని అన్నారు. అందుకే.. పోటీ చేయకపోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చానని వివేక్‌ చెప్పారు.

టిఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు వివేక్. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయన్ని పార్టీలోకి తీసుకురావానికి విశ్వప్రయత్నాలు చేశారు. అయితే వివేక్ వెనుకడుగు వేయడంతో ఆయన బీఎస్పీ లేదా స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉంటారని భావించారు. అయితే ఎవరు ఉహించని విధంగా పోటీనుండి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్లేనని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -