హాస్య నటుడు సత్య హీరోగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. సోనీ ఎలైవి ఓటీటీలో ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా సత్య సరసన అర్జావీ రాజ్ హీరోయిన్గా నటించగా సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ – సోల్జర్స్ ఫ్యాక్టరీ – వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్ – సందీప్ కిషన్ నిర్మించారు. హీరోగా తన అదృష్టాన్ని పరిక్షీంచుకుంటున్న సత్య…వివాహ భోజనంబుతో ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..
కథ:
మహేశ్ (సత్య) ఎల్ఐసీ ఏజెంట్. మహా పిసినారి. డబ్బులు పొదుపు చేయడానికి ఏమైనా చేస్తాడు. ఈ క్రమంలో అనిత(ఆర్జవి) అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. వీరి పరిచయం పెళ్లికి దారితీయగా ఇష్టం లేకపోయిన మహేశ్‌తో పెళ్లికి ఒప్పుకుంటుంది అనిత ఫ్యామిలీ. సీన్ కట్ చేస్తే లాక్ డౌన్ రావడం, పెళ్లికి వచ్చిన అనిత కుటుంబ సభ్యులందరూ మహేశ్ ఇంట్లోనే ఉండిపోవాల్సి రావడంతో తర్వాత ఏం జరుగుతుంది…? బంధువులను పోషించడానికి మహేశ్ ఎలాంటి తిప్పలు పడ్డాడనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కామెడీ, సత్య నటన,ఫస్టాఫ్. పిసినారి మహేశ్ పాత్రలో ఒదిగిపోయారు సత్య.తన నటనతో నవ్వులు పూయించారు. సత్య స్నేహితుడిగా నటించిన సుదర్శన్, మామగా శ్రీకాంత్ అయ్యంగార్లు సినిమాకు ప్రధాన బలం. శివన్నారాయణ, హర్ష, సుబ్బరాయశర్మ ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు నటించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ క్లైమాక్స్, సందీప్ కిషన్ ఎపిసోడ్. ఫస్టాఫ్‌లో నవ్వులు పూయించిన దర్శకుడు సెకండాఫ్‌పై మరింత దృష్టిసారిస్తే బాగుండేది. సందీప్ కిషన్‌ను తాగుబోతుగా, ‘భ్రమ’లో బతికే వాడిగా చూపించిన విధానం నవ్వులు పంచకపోగా ఆయా సన్నివేశాలన్నీ అతికించినట్లు అనిపిస్తాయి.క్లైమాక్స్ రోటిన్‌గా అనిపిస్తుంది
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. అన్వీ సంగీతం, మణికందన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
కరోనా లాక్డౌన్ టైంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి టైంలో ఓ పిసినారి ఇంట్లో..పదిహేను మంది చిక్కుకుపోవడం, వారిని పోషించడానికి హీరో పడ్డ కష్టాలు ఏంటి అనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం వివాహభోజనంబు. కామెడీ, సత్య నటన సినిమాకు హైలైట్ కాగా సెకండాఫ్ కాస్త నిరుత్సాహ పరుస్తుంది. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే చిత్రం వివాహ భోజనంబు.
విడుదల తేదీ: 27/08/2021
రేటింగ్: 2.5
నటీనటులు: సత్య, సందీప్ కిషన్
సంగీతం: అన్వీ
నిర్మాత: కె.ఎస్.శినిష్, సందీప్ కిషన్
దర్శకత్వం: రామ్ అబ్బరాజు