దళిత బంధు లబ్దిదారుల సర్వే..ప్రారంభం

177
Dalit Bandhu
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం దళితబంధు. పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోగా ఇప్పటికే దశల వారీగా రూ. 2 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే ప్రారంభమయింది.

సర్వే కోసం వచ్చిన అధికారులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. వీణవంక ఎస్సీ కాలనీలో జరిగిన సర్వే కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి మహేశ్వర్‌ పాల్గొన్నారు. మండలంలోని బేతిగల్‌లో జరిగిన సర్వేలో ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి, డీఆర్డీవో శ్రీలత పాల్గొన్నారు. దళిత బంధు సర్వేకోసం వచ్చిన అధికారులకు ఘన స్వాగతం పలుకుతున్నారు అధికారులు.

350 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. రోజుకు 100-150 ఇళ్లు సర్వే చేస్తారు. సర్వే అనంతరం గ్రామసభలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించనున్నారు.

- Advertisement -