రామన్న యూత్..తప్పకుండా చూడండి

39
- Advertisement -

టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – నా సినిమా ప్రదర్శించే థియేటర్ దగ్గరకు వెళ్లి టికెట్ మీద ఆ సినిమా పేరు చూడాలనుకునేవాడిని. ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయినప్పుడు దేవి థియేటర్ కు వెళ్లి వంద టికెట్స్ కొని వాటిని చూసుకుని సంతోషపడ్డాను. మా ఫలక్ నుమా దాస్ సినిమా ఆడిషన్ కు అభయ్ వచ్చాడు. అప్పుడు ఆడిషన్ కు వచ్చిన వారిలో అభయ్ సీనియర్. సీనియర్ అని జాగ్రత్తగా ఆడిషన్ తీసుకున్నా. చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదు అని పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్ నుమా దాస్ వంటి ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలా మంది కానీ..ఆ సినిమా వెనక పనిచేస్తున్న వాళ్లు ఎంత టాలెంటెడ్ అనేది చూస్తే అది సినిమాకు అసలైన స్ట్రెంత్ అని నమ్ముతాను. రామన్న యూత్ కు అలాంటి మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలని కోరుకుంటున్నా. పొలిటికల్ నాలెడ్జ్ రూరల్ యూత్ కు ఎక్కువగా ఉంటుంది. క్రికెట్, పొలిటికల్ నాలెడ్జ్ వారికే ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫ్లేవర్ ఈ సినిమాలో తీసుకొచ్చాడు అభయ్. ఈ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో కొంతమంది మహిళలు పనిచేశారని విన్నాను. అమ్మాయిలు ఇండస్ట్రీకి రండి. బాలీవుడ్ లో చాలా మంది వుమెన్ సినిమాకు వర్క్ చేస్తారు. మీరు సెట్ లో ఉంటే అబ్బాయిలకు మోటివేషన్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ ఏడాదిన్నర క్రితమే ఈ కథ గురించి చెప్పాడు చాలా బాగుందని. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. హోల్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ నెల 15న రామన్న యూత్ సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

Also Read:పిక్ టాక్ :ఉప్పొంగిన పరువాల విస్ఫోటనం

యాక్టర్ తాగుబోతు రమేష్ మాట్లాడుతూ – సినిమాల్లో ఎ‌వరు బాగా నటించినా నేను ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తుంటాను. అలా పెళ్లి చూపులు టైమ్ నుంచి అభయ్ ఏ సినిమాలో నటించినా ఫోన్ చేసి చెప్పేవాడిని. అలా మా మధ్య స్నేహం మొదలైంది. ఒక రోజు నన్ను కలిసి కథ చెప్పాడు. ఒక చిన్న పాయింట్ ను ఎంతో ఆకట్టుకునేలా కథ నెరేట్ చేశాడు. తమిళ, మలయాళ సినిమాలు చూసినప్పుడు ఒక చిన్న పాయింట్ తో ఎంత బాగా సినిమా చేశారనిపిస్తుంది. ఈ కథ విన్నప్పుడు నాకు అలా అనిపించింది. రామన్న యూత్ లో నాకు అనిల్ అన్న అనే క్యారెక్టర్ ఇచ్చాడు. సగం సినిమాలో నేనుంటా, మిగతా సగంలో నా పేరు వినిపిస్తుంటుంది. అభయ్ ఎంతో క్లారిటీగా సినిమాను తెరకెక్కించాడు. అతని హార్డ్ వర్క్ చూసి ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చిన విశ్వక్, ప్రియదర్శి, తిరువీర్ కు థాంక్స్ చెబుతున్నా. అన్నారు.

Also Read:ఆ దర్శకుడికి ఇదే చివరి అవకాశం

- Advertisement -