టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్ సేన్ మునుపటి సినిమా హిట్ మంచి కమర్షియల్ హిట్టయింది. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పాగల్’. నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పిస్తుండగా, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈరోజు ‘పాగల్’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లో విష్వక్ సేన్ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్లే ఆయన క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. టీజర్ స్టార్టింగ్‌లో ఆయన కొంతమంది యువకుల బృందం దగ్గరకు వెళ్లి, “రేయ్ ఎవడ్రా నా లవర్‌ని ఏడ్పిచ్చింది?” అనడిగాడు. ఆ బృందంలో ఒకతను “ఇంతకీ నీ లవర్ ఎవర్రా?” అనడిగాడు. “బేబీ” అని పిలిచాడు విష్వక్.
కట్ చేస్తే.. మన హీరో కొంతమంది అమ్మాయిలతో పాటు ఓ పండుముసలి బామ్మకు కూడా గులాబీ పువ్వునిచ్చి “ఐ లవ్ యూ” అని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రౌడీలు తన తలపై మందు బాటిళ్లతో కొడుతూ ఉంటే, “రేయ్.. నా లవర్ ఫేస్‌లో హ్యాపీనెస్ కనిపియ్యట్లేదురా.. స్ట్రాంగ్‌గా కొట్టండీ.. స్ట్రాంగ్‌గా.. వైల్డ్‌గా.. నా లవ్‌లా రా” అని అడిగి మరీ కొట్టించుకొని, ఆ తర్వాత వాళ్ల భరతం పడుతూ కనిపించడం అతని క్యారెక్టరైజేషన్ ఏమిటనేది తెలుస్తోంది.
టీజర్ చివరలో రాహుల్ రామకృష్ణతో, “నువ్వేంట్రా నా లవర్‌ను సినిమాకి రమ్మంటున్నావంటా?” అని అడిగాడు విష్వక్. అతను వేలు చూపిస్తూ, “రేయ్.. నేను సిన్మాలు జూడ. చెయ్ చూసినవా ఎంత రఫ్‌గుందో.. వోన్లీ బిట్లు” అని పారిపోవడం నవ్వు తెప్పించింది. విష్వక్ సేన్ క్యారెక్టర్‌లో ఓ లవర్‌తో పాటు ఫెరోషియస్ పర్సన్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది.
టీజర్‌లో హీరోయిన్ సిమ్రాన్ చౌదరి అందంగా కనిపిస్తే, మురళీ శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రధన్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఎస్. మణికందన్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్‌గా కనిపిస్తున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.సమ్మర్ కానుకగా ‘పాగల్’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
తారాగణం: విష్వక్ సేన్, సిమ్రాన్ చౌధరి, మేఘలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ
సాంకేతిక బృందం:
బ్యానర్స్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేష్ కుప్పిలి
సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
మ్యూజిక్: రధన్
ఎడిటింగ్: గ‌్యారీ బీహెచ్
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కేకే, కిట్టు విస్సాప్రగడ
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, రామకృష్ణ
కొరియోగ్రఫీ: వివిజయ్ ప్రకాష్
ప్రొడక్షన్ డిజైనింగ్: లతా తరుణ్
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
పీఆర్వో: వంశీ-శేఖర్.