మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన హరీష్ రావు..

20
harish rao

ఇటీవలే తండ్రిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కలిసి పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తండ్రి నారాయణగౌడ్ అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస్‌ గౌడ్ ఇంటికి వచ్చిన హరీష్ రావు.. నారాయణగౌడ్ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం‌ చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.