మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ధమ్కీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వర్క్ పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు మార్చ్ 22 న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ తో ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది.
అయితే ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు విశ్వక్. 17 న భారీ ఎత్తున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ను కలిసి తన ఫంక్షన్ కి రావాలని ఇన్వైట్ చేశాడు విశ్వక్. అభిమాని అడగడంతో ఎన్టీఆర్ ఒకే అనేసి డేట్ ఇచ్చేశాడు. అమెరికా నుండి రాగానే ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కి అటెండ్ అవుతాడు.
మాస్ కా దాస్ తో మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారిన విశ్వక్ ధమ్కీ తో మరోసారి డైరెక్టర్ గా తన లక్ చెక్ చేసుకోనున్నాడు. ఇప్పటికే సాంగ్స్ , ట్రైలర్స్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.
ఇవి కూడా చదవండి..