‘NTR 30’ టైటిల్ దేవర!

29
- Advertisement -

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాలతో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ ఆసక్తికర టైటిల్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కెరీర్‌ లో 30 సినిమాగా వస్తున్న ఈ మూవీకి ‘దేవర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. కొరటాల శివకి మంచి దర్శకుడిగా గొప్ప పేరు ఉంది. అయితే, అంతకు మించి మంచి కథా రచయితగా కొరటాల శివకి లాంగ్ జర్నీ ఉంది.

ముఖ్యంగా కొరటాల శివ రాసే బలమైన పాత్రలకు, భావోద్వేగ సన్నివేశాల్లో కొరటాల శివ రాసే లోతైన మాటలకు ఎందరో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కొరటాల శివ పెట్టే టైటిల్స్ కూడా చాలా బలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో దేవర అంటూ వినిపిస్తున్న టైటిల్ మొత్తానికి ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ జాపూర్ కన్ఫర్మ్ అయ్యింది.

కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్‌ 5న విజయ దశమి సందర్భంగా విజయదుందుభి మోగించడానికి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ వజ్రాల దొంగ అని.. అలాగే సముద్రంలో సైనికుల్ని కాపాడే రక్షకుడిగానూ కనిపిస్తాడని.. ఒక దొంగ దేశం కోసం పోరాడే వీరుడిగా ఎలా మారాడు ? అనేది ఎన్టీఆర్ పాత్ర అని ఇప్పటికే మేం రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -