విశాల్‌ను తక్షణమే తప్పుకోమంటున్న చేరన్‌..

194
- Advertisement -

రాజకీయాల్లోకి వస్తున్నానంటూ కోలీవుడ్ హీరో విశాల్ చేసిన ప్రకటన సెన్సేషన్ అయిపోయింది. ఎలాంటి కన్ ఫ్యూజన్స్ లేకుండా.. స్ట్రెయిట్ గా చెప్పేశాడు ఈ హీరో. అయితే.. రాజకీయాలు అంటే దాడులు- ఎదురుదాడులు సహజమే. సినిమా రంగంలో కూడా ఇలాంటివి ఉన్నా అన్నీ సైలెంటుగా జరిగిపోతాయి. అయితే ఇప్పుడు విశాల్‌పై కూడా పొలిటికల్‌ దాడి మొదలైందనే చెప్పాలి. ఆర్‌కే నగర్‌లో పోటీ చేసేందుకు సిద్ధమైన నటుడు విశాల్‌ తక్షణం తప్పుకోవాలని  తమిళ ‘ఆటోగ్రాఫ్’ సినిమా దర్శకుడు చేరన్‌ డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ కామెంట్‌ పోస్ట్‌ చేశారు. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. ఆయన ఎవరి ప్రోద్బలంతోనో పోటీ చేస్తున్నారని, ఫలితంగా ఆయన బలిపశువు కానున్నారన్నారు. ముఖ్యంగా నడిగర్‌ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన వెంటనే డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని కలుసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకుని తమను ఆశ్చర్యానికి గురి చేశారన్నారు.

Vishal must resign from Producers' Council

ఇపుడు ఆర్‌కే నగర్‌ ఉపఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసేముందు మెరీనాతీరంలోని ఎంజీఆర్‌, జయలలిత సమాధులకు అంజలి ఘటించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని విశాల్‌ నిర్ణయం తీసుకోవడంతో చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోనున్నారని తెలిపారు. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల విశాల్‌కు ఎలాంటి ప్రయోజనం కూడా చేకూరదన్నారు. అదేసమయంలో నిర్మాతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విశాల్‌ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమిళ చిత్రపరిశ్రమ అనేకమంది అశోక్‌కుమార్‌లను చూడాల్సి వస్తుందన్నారు.

- Advertisement -