విశాల్ మూవీకి నిర్మాతగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్..

351
vishal new movie
- Advertisement -

సినిమా కలల ప్రపంచంలో తనబాటను తానే వేసుకున్న కార్తికేయ ఎగ్జిబిటర్స్ అథినేత ఆడెపు శ్రీనివాస్ “ఇస్మార్ట్ శంకర్”, “హుషారు”, “గద్దలకొండ గణేష్” చిత్రాలతో సక్సెస్ పుల్ ఎగ్జిబిటర్ గా,డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీలో మన్ననలు పొందారు. ఇప్పుడు నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. తొలిచిత్రంగా మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన భారీ చిత్రం ‘యాక్షన్’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

Vishal

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ: ” డిస్ట్రిబ్యూటర్ గా ఇస్మార్ట్ శంకర్, హుషారు, గద్దలకొండ గణేష్ నాకు మంచి విజయాన్ని అందించాయి. మాస్ హీరో విశాల్ చేస్తున్న యాక్షన్‌తో నిర్మాతగా మారుతున్నాను. దీనితో పాటు “ఎరుపు- పసుపు- పచ్చ ” వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నాము.

Vishal Action movie

ఇప్పుడు రాజుగారి గది -3, అక్షర సినిమాలను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. త్వరలో నిర్మాణ రంగంలో అడుగు పెడుతున్నాను. విజయదశమి సందర్భంగా ఈ విషయాలను మీతో పంచుకోవడం చాలా అందంగా ఉంది “అన్నారు.

- Advertisement -