రికార్డుల వేటలో కోహ్లీ,రోహిత్

226
India-West Indies ODI
- Advertisement -

భారత్-వెస్టిండీస్‌ మధ్య జరగనున్న రెండో వన్డేకు విశాఖ సిద్ధమైంది. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విండీస్ భావిస్తోండగా రెండో వన్డేలోను గెలిచి సిరీస్‌ను గెలిచేందుకు టీమిండియా కసరత్తు చేస్తోంది.

విశాఖ వన్డే ప్రపంచ రికార్డులకు వేదికవనుంది. వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. కోహ్లి మరో 81 పరుగులు చేస్తే వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇక రోహిత్ శర్మ ఒక సిక్సర్ బాదితే.. వన్డేల్లో సచిన్‌ 195 సిక్సర్ల రికార్డును సమం చేయనున్నాడు.

వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు ఇది 950వ మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా టీమ్‌ఇండియా అరుదైన ఘనత సాధించనుంది. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో 949 మ్యాచ్‌లు ఆడిన భారత్ 490 మ్యాచ్‌ల్లో గెలువగా, 411సార్లు ఓడింది. భారత్ తర్వాత 916 వన్డేలు ఆడిన ఆస్ట్రేలియా రెండో స్థానంలో ,899 మ్యాచ్‌లతో పాక్ మూడో స్ధానంలో, శ్రీలంక (827), వెస్టిండీస్ (781) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

టీమిండియా:
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌

- Advertisement -