టాస్ ఓడిన బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌..

69
India vs New Zealand,

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టీ 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి భార‌త్‌కు బ్యాటింగ్‌ అవకాశం ఇచ్చి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇటీవల జరిగిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే కప్ భారత్ సొంతమైంది.

నేటి మ్యాచ్ లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగింది. భారత జట్టులో సంజు సామ్సన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దుబే, సుందర్, ఠాకూర్, చాహల్, సైనీ, బుమ్రా ఉన్నారు. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.