ఇన్నాళ్లూ వాళ్ల పెళ్లి.. వీళ్ల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేసిన విరుష్క జోడీ.. ఇప్పుడు వాళ్ల పెళ్లిలోనే స్టెప్పులేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో గురువారం రాత్రి వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేశారు. అదిరిపోయే కాస్టూమ్స్‌తో రాయల్ లుక్‌లో కనిపించిన ఈ సెలబ్రిటీ జోడీ ఇచ్చిన రిసెప్షన్‌కు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటు క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనా, గంభీర్ హాజరయ్యారు. వీళ్ల రిసెప్షన్ కోసం స్పెషల్‌గా ఓ స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. పార్టీ తర్వాత పంజాబీ మ్యూజిక్‌తో హోటల్ హోరెత్తిపోయింది.
కాగా వీరి రిసెప్షన్‌లో అందరు డ్యాన్స్ చేస్తున్న సమయంలో నోట్ల వర్షం కురిసింది. ఈ సందర్భంగా అనుష్క చేసిన డ్యాన్స్ వివాదాస్పదమైంది. అతిథులతో కలిసి అనుష్క డ్యాన్స్ చేస్తున్న సమయంలో నోట్లో డబ్బులు పెట్టుకోని డ్యాన్స్ చేయడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పెళ్లి కూతురు, ఓ సెలబ్రిటీ అయిన అనుష్క తన పరిధిని దాటి అలా చిందేయడాన్ని తప్పుబడుతున్నారు.
https://www.instagram.com/p/Bc_SjN3F3TV/?taken-by=justfilmy1