హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నో హోప్స్ తో చేసిన విరూపాక్ష సినిమా నేడు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే విరూపాక్ష సినిమాని చూసిన కొందరు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలుపుతూ మెసేజ్ లు పెడుతున్నారు. దర్శకుడు కార్తీక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడని, స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉందని, ట్విస్టులు కూడా బాగానే ఉన్నట్లు ఆ మెసేజ్ ల్లో ప్రధానమైన అంశాలు. అయితే, ఈ క్రమంలో కొందరు విరూపాక్ష సినిమాలోని ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను మొత్తం బయటకు రివీల్ చేస్తున్నారని విరూపాక్ష టీమ్ మెంబర్స్ బాధ పడుతున్నారు.
Also Read:గోపీచంద్..’రామబాణం’ ట్రైలర్
ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తూ.. విరూపాక్ష సినిమా చూసిన ప్రేక్షకులు బయటకు వెళ్లి దయచేసి స్టోరీని రివీల్ చేయొద్దని, మిగిలిన ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలని, కాబట్టి.. సినిమాలో టర్నింగ్ పాయింట్స్ ను, మెయిన్ ట్విస్ట్ లను చెప్పొద్దు అంటూ ప్రేక్షకులకు సినిమా బృందం కీలక విజ్ఞప్తి చేసుకుంది. అలాగే, ప్రతి ఒక్కరు సినిమాని థియేటర్‌లలో చూడాలని వేడుకుంది.
Also Read:Twitter:జగన్ – సమంతకు షాక్
కాగా, ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయినా, సెకండాఫ్‌లో సీరియస్ డ్రామాతో చక్కటి వేరియేషన్ చూపించినా.. సినిమా చాలావరకూ స్లోగా సాగింది అని.. కాకపోతే.. ఓవరాల్ గా సినిమాలో మంచి కంటెంట్ ఉండటంతో మెప్పిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద చాలా సినిమాల తర్వాత సాయి ధరమ్ తేజ్ కి ఓ హిట్ పడింది.
Team #Virupaksha requests viewers not give away spoilers to let everyone experience the Mystical Thriller to the fullest.
Book your tickets for #BlockbusterVirupaksha
https://t.co/HzG8SAAGh7@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/qEwMrPiVAE
— SVCC (@SVCCofficial) April 21, 2023