గ్రీన్ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ‘విరాటపర్వం’ టీమ్‌..

32
Viratparvam Movie Team
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో విరాటపర్వం చిత్ర బృందం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల, నటుడు నవీన్ చంద్ర, సినిమాటోగ్రాఫర్ డానిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వేణు ఉడుగుల,నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో వసంతంలోకి అడుగుపెట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -