టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్..

85
Tollywood
- Advertisement -

టాలీవుడ్‌లో నేటినుండి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు నుంచి షూటింగ్‌లు బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగు ఫిలిం ఫెడరేషన్. దీంతో సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరుకాలేదు. వారంతా కృష్ణ నగర్‌లోని తమ యూనియన్ ఆఫీస్‌లకు చేరుకుంటున్నారు.

షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. ఇవాళ పది గంటల నుంచి తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ వద్ద 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు. అయితే ఈ అంశంపై ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలితో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు.

సినీ కార్మికుల‌కు వేత‌నాలు పెంచాలంటూ 24 విభాగాల‌కు చెందిన సిబ్బంది స‌మ్మె చేయనున్నట్లు నిన్ననే ప్రకటించారు. అయితే ఈ స‌మ్మె చేయకుండా ఉండేలా నిర్మాత‌ల మండ‌లి స‌హా ప‌లు సంఘాలు మంగ‌ళ‌వారం య‌త్నించాయి. స‌మ్మె ప్ర‌తిపాదించిన విభాగాల సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపాయి. అయితే ఈ చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేదు. చర్చ‌లు విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఈ రోజు నుంచే షూటింగ్‌ల‌ను బంద్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

- Advertisement -