- Advertisement -
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ 37 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి చేరుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు కోహ్లీ.
ప్రస్తుతం ఈ రికార్డు సచిన్, బ్రియాన్ లారా మీద ఉంది. వాళ్లిద్దరూ 453 ఇన్నింగ్స్ లో 20వేల పరుగులు చేశారు. వారి తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్ లో 20వేల పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే సచిన్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ట్వంటీ థౌజండ్ రన్స్ క్లబ్లో చేరిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మెన్ కోహ్లీయే!
- Advertisement -