- Advertisement -
కొత్త సంవత్సరం…కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. విండీస్‌తో సిరీస్ అనంతరం రెండు వారాల తర్వాత కొత్త హెయిర్‌స్టైల్‌తో దర్శనమిచ్చాడు. సెలబ్రిటీ స్టైలిస్ట్ మొగుల్ హకీమ్ దగ్గర న్యూహెయిర్ స్టైల్ చేయించుకున్న కోహ్లీ తన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
కోహ్లీ కొత్త లుక్‌ని చూసి అంతా షాకవతున్నారు. వాస్తవానికి స్టైల్‌కు పెట్టింది పేరు కోహ్లీ. ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్‌ను అనుకరించడంలో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా మెస్మరైజ్ చేసే విరాట్ లుక్‌ని ఫాలో అయ్యే హీరోలు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు.
మరోవైపు కొత్త ఏడాదిని పొట్టి ఫార్మాట్‌తో ప్రారంభించేందుకు భారత్ సిద్ధమైంది. శ్రీలంకతో ఆదివారం నుంచి గువాహటిలో తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
- Advertisement -