కరోనా లేకుంటే…అక్కడుండే వాడిని..!

327
virat
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా దొరికిన సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో తన భార్య అనుష్కతో కలిసి ఫామ్ హౌస్‌లో ఉన్న విరాట్‌ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు అప్ డేట్స్ అందిస్తూనే ఉన్నారు.

తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించాడు కోహ్లీ. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కరోనా ప్రభావంతో అనుష్కతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికిందని…కరోనా లేకుంటే ఈ సమయానికి చిన్నస్వామి స్టేడియంలో ఉండేవాడినని వెల్లడించాడు.

భారత్‌ తరఫున ధోనితో, ఐపీఎల్‌లో డివిలియర్స్‌తో జోడిగా మైదానంలో ఆడటాన్ని బాగా ఇష్టపడతా. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉ న్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపించలేనని వెల్లడించాడు. ఆరోగ్య సమస్యలతో 2018 ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు శాకాహారిగా మారానని చెప్పారు.

- Advertisement -