లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే..రెండేళ్లు జైలుకే

192
lock down

కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం,లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాపై ఫేక్ న్యూస్ వైరల్ చేసినా…పని లేకుండా రోడ్లపైకి వచ్చినా రెండేళ్లు జైలు శిక్ష విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

విపత్తు నిర్వహణ చట్టం-2005, భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 188లను ప్రయోగించాలని…రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను విధించాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశారు.

ఇక మరోవైపు తెలంగాణలో కరోనాపై తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక వెబ్ సైట్‌ని ప్రారంభించింది ప్రభుత్వం.వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియ చెప్పేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథనాలను ఈ వెబ్‌సైట్‌లో పెట్టడంతో పాటు అందులోని వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. factcheck. telangana. gov.in వెబ్‌సైట్లో వాస్తవాలు ధ్రువీకరించుకోవాలని కోరారు.