వరల్డ్ కప్ తర్వాత ఇండియా జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీంఇండియా కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు వచ్చాయని సమాచారం. వీరిద్దరూ చెరొక గ్రూపు ఏర్పరచుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కోహ్లీ, అనుష్క శర్మలను ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ శర్మ అన్ ఫాలో చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే తాజాగా వీటన్నింటికి సమధానం చెప్పాడు కెప్టెన్ కోహ్లి.
రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ కారణంగా తన కెప్టెన్సీ కి ముప్పు వస్తుందని తానే భావించలేదన్నారు. రోహిత్ శర్మ మంచి బ్యాట్స్ మెన్ అని..అతని బ్యాటింగ్ నేను పెద్ద అభిమానిని అని చెప్పుకోచ్చారు. క్రికెట్ పై దృష్టిపెట్టాల్సిన సమయంలో లేని వివాదాన్ని రేకెత్తిస్తున్నారని, ఈ విషయమై మీడియా ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు. మా ఇద్దరి మధ్య గొడవ సృష్టించడం వల్ల ఎవరు లాభపడుతారో అన్నారు కోహ్లి.