అల్లం నారాయణ పదవీ కాలం పొడిగింపు

365
allamnarayana1
- Advertisement -

తెలంగాణ మీడి యా అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు అల్లం నారాయణ. కాగా జూన్ 30వ తేదితో అల్లం నారాయణ పదవి ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

allamnarayana

ఇవాళ అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లుగా అమలుపరుస్తున్న జర్నలిస్టుల శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలపై మీడియా అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా అల్లం నారాయణ అందజేశారు. అల్లం నారాయణతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిశారు.

- Advertisement -